ఎమ్మెల్సీ, కార్పొరేషన్ ఎన్నికలపై బీజేపీ కసరత్తు!

TG: రాష్ట్రంలో త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు బీజేపీ సన్నద్ధమవుతోంది. రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలతో పాటు ఐదు మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కమలదళం కసరత్తు ప్రారంభించింది. బుధవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు అధ్యక్షతన జరిగిన సన్నాహక సమావేశంలో ఎన్నికల వ్యూహాలు, క్షేత్రస్థాయి కార్యాచరణ, ఓటర్ల నమోదుపై చర్చించారు. హైదరాబాద్ సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌కు మల్క కొమరయ్య, నల్గొండ సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌కు అంజిరెడ్డిలను ఇన్‌‌‌‌‌‌‌‌ఛార్జీలుగా నియమించారు. ఐదు కార్పొరేషన్లకు కూడా ఇన్‌‌‌‌‌‌‌‌ఛార్జీలను నియమించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕