ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, రాజ్యాంగబద్ధ సంస్థలను బీజేపీ లూటీ చేస్తోందని పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యంగా బెంగాల్లో ఎన్నికల వ్యవస్థను లూటీ చేసి, అధికార యంత్రాంగాన్ని తమకు అనుకూలంగా వాడుకుంటూ ఓటు చోరీకి పాల్పడ్డారని ఆమె పేర్కొన్నారు. ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్‌ను తరిమేస్తేనే ప్రజాస్వామ్యం రక్షించబడుతుందని ఆమె వ్యాఖ్యానించారు. రామ్‌లీలా వేదికగా బీజేపీ హఠావో నినాదాన్ని బలంగా వినిపించాలని ఆమె పిలుపునిచ్చారు.