వైద్యురాలిని లైంగికంగా వేధించిన బీజేపీ నేత

మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో గురువారం తెల్లవారుజామున ప్రభుత్వ బుందేల్‌ఖండ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో బీజేపీ యువజన నాయకుడు అనిల్ శ్రీవాస్తవ ఒక వైద్యురాలిని లైంగికంగా వేధించి, ఆమెను కాల్చి చంపుతానని బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. వైద్య సిబ్బందితోనూ అసభ్యంగా ప్రవర్తించినట్లు సమాచారం. ఈ సంఘటనపై వైద్యులు, నర్సింగ్ సిబ్బంది నిరసన తెలిపారు. పోలీసులు అనిల్ శ్రీవాస్తవ, అతని అనుచరుడిపై కేసు నమోదు చేసి, గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్