TG: గజ్వేల్‌లోని KCR క్యాంపు ఆఫీస్ వద్ద బీజేపీ నేతలు బుధవారం నిరసన చేపట్టారు. ఆఫీసుకు గేటుకు 'టూలెట్' బోర్డుతో పాటు KCR కనిపించడం లేదని 'వాంటెడ్ ఎమ్మెల్యే' బోర్డును తగిలించారు. KCRకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు అక్కడకు చేరుకుని వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో బీజేపీ నేతలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. బీజేపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.