ట్రాఫిక్ పోలీస్ అవ‌తార‌మెత్తిన బీజేపీ ఎమ్మెల్యే (వీడియో)

బీజేపీ సీనియర్ నాయకుడు, కర్ణాటక మాజీ విద్యాశాఖ మంత్రి సురేష్ కుమార్ మంగళవారం బెంగళూరులోని రాజాజీనగర్ భాష్యం సర్కిల్‌లో ట్రాఫిక్ పోలీసుగా విధులు నిర్వహించారు. వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనల ప్రాముఖ్యతను వివరించారు. ట్రాఫిక్ జామ్‌లను తగ్గించడంలో ప్రతి పౌరుడు తమ వంతు పాత్ర పోషించాలని సూచించారు. బెంగళూరు పోలీసులు చేపట్టిన 'ట్రాఫిక్ కాప్ ఫర్ ఎ డే' కార్యక్రమంలో భాగంగా ఆయన ఈ విధులను నిర్వహించారు. ఈ అనుభవం అద్భుతంగా ఉందని, స్వాగతించదగిన కార్యక్రమమని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్