మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రతిపక్షాలు వ్యతిరేకించడంపై బీజేపీ నిరసన కార్యక్రమం చేపట్టింది. యూపీలోని బహ్రైచ్‌లో రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ దిష్టిబొమ్మలను దహనం చేస్తుండగా.. మంటలు అంటుకుని BJP మహిళ MLA అనుపమ జైస్వాల్ గాయపడ్డారు. ఆమె ముఖం, నుదుటి భాగంలో కాలిన గాయాలయ్యాయి. మంటలు అంటుకోవడంతో ఆమె జుట్టులో కొంత కాలిపోయింది. వెంటనే స్పందించిన కార్యకర్తలు మంటలను ఆర్పి, ఆమెను చికిత్స నిమిత్తం లక్నోకు తరలించారు. ఈ వీడియో ప్రస్తుతం SMలో వైరల్ అవుతోంది.