తెలంగాణ అభివృద్ధిపై బుధవారం కేంద్ర మంత్రులతో బీజేపీ ఎంపీలు భేటీ అయ్యారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనపై నితిన్ గడ్కరీ, మనోహర్ లాల్ కట్టర్‌తో డీకే అరుణ, ఈటల రాజేందర్, కె.విశ్వేశ్వర్ రెడ్డి, రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్, గోడం నగేష్ సమావేశమయ్యారు. తెలంగాణలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాష్ట్ర సమగ్ర పురోగతికి సంబంధించిన అంశాలపై చర్చించారు.