TG: త్వరలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో BJP అధినాయకత్వం సన్నాహాలు చేస్తోంది. ఇవాళ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డితో పాటు ఎంపీ ఈటల రాజేందర్ లు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ అభయ్ పాటిల్‌తో భేటీ అయ్యారు. ఈ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యతలు ఈటలకు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.