ఇండియా' కూటమి ర్యాలీకి పోటీగా అధికార బీజేపీ కూడా ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో పాదయాత్రలు చేపట్టింది. ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టేందుకు 'లోక్తంత్ర్ బచావో, అరాచక్ హటావో' పేరిట బీజేపీ నేతలు పాదయాత్రలు చేపట్టారు. ఢిల్లీలో సీఎం రేఖగుప్తా సారథ్యంలో బీజేపీ పాదయాత్ర జరిగింది. ఇందులో కేంద్ర మంత్రులతోపాటు పలువురు ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఫరీదాబాద్‌లోని NIT బీకే చౌక్ నుంచి కేంద్ర మాజీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పాదయాత్ర చేపట్టారు