కేరళలో కేంద్రమంత్రి అమిత్ షా శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వికసిత కేరళనే బీజేపీ లక్ష్యమని పేర్కొన్నారు. కేరళ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, కేరళలో తమ సీఎం లేకున్నా వికసిత కేరళనే బీజేపీ లక్ష్యమని నొక్కి చెప్పారు. వరుసగా అధికారంలోకి వచ్చిన యూడీఎఫ్, ఎల్‌డీఎఫ్ ప్రభుత్వాలు అవినీతిలో మాత్రమే పాలుపంచుకున్నాయని విమర్శించారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) లాంటి దేశ వ్యతిరేక శక్తులకు కేరళను సురక్షితమైన స్వర్గధామంగా మార్చాయని మండిపడ్డారు.