రానున్న మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అజేయమైన శక్తిగా ఎదగాలని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. శుక్రవారం తన నివాసంలో మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మున్సిపాలిటీల నాయకులతో సన్నాహక సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయాల్లో గెలుపే అంతిమ లక్ష్యమని, సుపరిపాలన, ప్రజలు మెచ్చే పాలన అందించడమే బీజేపీ ప్రధాన ఉద్దేశమని అన్నారు.