TG: బీజేపీ లక్ష్మణ్ అసహనంతో మాట్లాడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. 'ఆర్డినెన్స్ ఎలా చెల్లుబాటు అవుతుందని లక్ష్మణ్ అంటున్నారు. బీసీ రిజర్వేషన్‌లతోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని మేం ఆపాం. మీరు కేంద్రాన్ని ఒప్పించే ప్రయత్నం ఎందుకు చేయడం లేదు. బీజేపీ విధానమే బీసీ వ్యతిరేఖ విధానం. బీసీ రిజర్వేషన్‌కి బీజేపీ మద్దతు పలకాలి' అని అన్నారు.