TG: హైదరాబాదులోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ చీఫ్ రామచందర్‌రావు అధ్యక్షతన పదాధికారుల సమావేశం ప్రారంభమయింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి సునీల్ బన్సల్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సమావేశంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మోర్చాలా రాష్ట్ర అధ్యక్షులు పాల్గొన్నారు. తాజా రాజకీయ పరిణామాలు, ఎమ్మెల్సీ ఎన్నికలు, భవిష్యత్తు కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు.