తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుంది: కిషన్ రెడ్డి

త్వరలో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని నాంపల్లిలో ఆదివారం జరిగిన సభలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ..  కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ అవినీతి పార్టీలేనని, ప్రజలకు హామీలు ఇచ్చి మోసం చేశాయని ఆరోపించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ మజ్లిస్ పార్టీని పెంచి పోషిస్తున్నాయని, సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ ఉద్యోగస్థులపై నమ్మకం లేదని, BLOలుగా ఉన్నది తెలంగాణ ఉద్యోగస్థులే కదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం, డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని ఆయన ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్