తెలంగాణలో బీజేపీ ఏనాటికి ప్రత్యామ్నాయం కాబోదని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 24 నెలల కాంగ్రెస్ పార్టీ అసమర్థ పాలనకు, గత పదేండ్లలో జరిగిన అద్భుతమైన అభివృద్ధికి మధ్య తేడాను ప్రజలు బేరీజు వేసుకుంటున్నారని తెలిపారు. కచ్చితంగా మరోసారి బీఆర్‌ఎస్ వైపే నిలిచేందుకు ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రెండు సంవత్సరాల కింద జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయం గాలివాటమేనని అన్నారు.