రాజస్థాన్లో జరిగిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార బీజేపీ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. మొత్తం 10,244 వార్డులకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ 41 శాతం వార్డులలో విజయం సాధించగా, కాంగ్రెస్ పార్టీ 35 శాతానికే పరిమితమైంది. స్వతంత్ర అభ్యర్థులు 22.2 శాతం వార్డులను గెలుచుకున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ తన ఓటు శాతంలో సుమారు 5 శాతం కోల్పోయింది. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన స్థానాల సంఖ్య 57 శాతం పెరిగింది.