TG: నారాయణపేట మున్సిపల్ చైర్మన్ పదవిని బీజేపీ అభ్యర్థి కొండ సత్య యాదవ్ దక్కించుకున్నారు. కీలక సమీకరణాలతో బీజేపీ మున్సిపాలిటీపై పట్టు సాధించింది. ఎక్స్ అఫీషియో ఓటుతో కలిపి ఆయనకు 13 ఓట్లు లభించాయి. కాంగ్రెస్ అభ్యర్థికి 11 ఓట్లు వచ్చాయి. టీఆర్ఎస్ సభ్యులు తటస్థంగా ఉండటం, విభేదాలు రాకుండా చూడటం బీజేపీకి కలిసొచ్చింది. వైస్ చైర్మన్‌గా మంజుల రాఘవేందర్ రెడ్డి ఎన్నికయ్యారు.