తెలంగాణలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావు: మహేశ్ గౌడ్

తెలంగాణలో అధికారంలోకి వస్తామన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. తెలంగాణలో గత ఎన్నికల్లో 8 పార్లమెంట్ స్థానాల్లో గెలిచిన బీజేపీకి ఈసారి కనీసం 2 సీట్లు కూడా రావన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను చూసి ప్రతిపక్షాలు భయపడుతున్నాయని అన్నారు. ప్రజలు కాంగ్రెస్ తప్ప మరే పార్టీని నమ్మే పరిస్థితిలో లేరని వ్యాఖ్యానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్