పాకిస్థాన్‌పై బలూచ్ లిబరేషన్ ఆర్మీ మరోసారి భీకర దాడులకు పాల్పడింది. బలూచిస్థాన్‌లోని 18 ప్రాంతాల్లో 'ఆపరేషన్ బామ్' పేరుతో మిలిటరీ స్థావరాలు, ప్రభుత్వ కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు చేసింది. పాక్ సమాచార వ్యవస్థను ధ్వంసం చేసి, సురబ్ సైనిక స్థావరాన్ని స్వాధీనం చేసుకుంది. ఈ దాడుల్లో 18 మంది పాక్ సైనికులు మృతి చెందారు. ఈ దాడులు తామే చేసినట్లు బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది.