నల్ల మినప జావతో నొప్పుల నుంచి ఉపశమనం: నిపుణులు

పొట్టు తీయని నల్ల మినుములతో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలున్నాయని నిపుణులు తెలిపారు. వీటిలో క్యాల్షియం, ఐరన్, భాస్వరం, మెగ్నీషియం పుష్కలంగా లభిస్తాయి. నల్ల మినప జావ ఎముకల బలాన్ని పెంచి, నడుము, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మహిళల్లో యూరినరీ ఇన్ఫెక్షన్ల నివారణకు, ఆరోగ్యకరమైన బరువు పెంపునకు ఇవి మేలు చేస్తాయి. వారానికి రెండుసార్లు ఈ జావను తీసుకోవడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభించడమే కాకుండా, నొప్పుల నుంచి శాశ్వత ఉపశమనం లభిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్