గుజరాత్‌లో ఓ షాకింగ్ ఘటన జరిగింది. తాజాగా స్కూల్ బ్యాగ్‌లో నుంచి బయటపడ్డ ఓ పాము వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన సబర్‌కాంతలో వెలుగు చూసింది. ఓ విద్యార్థి తన నోట్‌బుక్‌ల కోసం బ్యాగ్ తీస్తుండగా.. అతనికి పాము కనిపించింది. దీంతో ఆ విద్యార్థి తన కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని చెప్పాడు. వారు బ్యాగ్‌ను బయటకు తీయగా నల్లతాచు బయటకు వచ్చింది. దీనిని చూసి వారంతా భయబ్రాంతులకు గురయ్యారు.