AP: విశాఖపట్నంలో ఇండియా-న్యూజిలాండ్ టీ20 మ్యాచ్ సందర్భంగా వైజాగ్ క్రికెట్ స్టేడియం వద్ద బ్లాక్ టికెట్ల దందా గుట్టు రట్టయింది. పోలీసులు బ్లాక్ టికెట్లు అమ్ముతున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీరు ఒక్కో టికెట్‌ను రూ.3 వేల నుంచి రూ.6 వేల వరకు అధిక ధరలకు అమ్ముతున్నట్లు సమాచారం. కాగా, కాసేపట్లో విశాఖ వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య 4వ టీ20 మ్యాచ్ జరగనుంది.