పురుగుల మందు ఇచ్చి బ్లాక్‌మెయిల్‌.. యువతి ఆత్మహత్య

AP: విజయనగరం జిల్లా గరివిడి మండలం తోండ్రంగిలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అఖిల (22) నిశ్చితార్థం వేళ పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. గతంలో వివాహితుడైన రాము నాయుడుతో ప్రేమలో పడిన అఖిలను, తాజాగా ఆమె నిశ్చితార్థం జరగనున్న నేపథ్యంలో రాము నాయుడు బెదిరించి, పురుగుల మందు తాగేలా చేశాడు. "నువ్వు చావకపోతే మన విషయం చెప్పి పెళ్లి చెడగొడతా" అంటూ బెదిరించడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. చికిత్స పొందుతూ అఖిల మృతిచెందగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్