పంజాబ్‌లో పేలుళ్లు.. రంగంలోకి దిగిన ఎన్ఐఏ (వీడియో)

పంజాబ్‌లోని జలంధర్, అమృత్‌సర్ నగరాల్లో మంగళవారం రాత్రి వరుస పేలుళ్లు సంభవించాయి. జలంధర్‌లోని బీఎస్‌ఎఫ్ చౌక్ సమీపంలో స్కూటర్ పేలగా, అమృత్‌సర్‌లోని సైనిక శిబిరం వద్ద మరో పేలుడు జరిగింది. ఇవి యాంత్రిక లోపాలు కాదని, గ్రెనేడ్ దాడులని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ దాడుల వెనుక పాకిస్థాన్ హ్యాండ్లర్లు, స్థానిక గ్యాంగ్‌స్టర్లు ఉన్నారని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ ఘటనల నేపథ్యంలో పంజాబ్ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు.

సంబంధిత పోస్ట్