ముంబైలో బిర్యానీ, పుచ్చకాయ తిన్న కుటుంబం మరణించడం కలకలం రేపింది. పోషకాహార నిపుణుల ప్రకారం, భారీ భోజనం తర్వాత పుచ్చకాయ తినడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు తలెత్తుతాయి. పుచ్చకాయలోని ఫ్రక్టోజ్ పెద్దప్రేగుల్లో పులిసి గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తుంది. జీర్ణశక్తి తక్కువగా ఉన్నవారు, ఎసిడిటీ సమస్యలు ఉన్నవారు భోజనం తర్వాత వెంటనే పుచ్చకాయ తినడం మానుకోవాలి. స్నాక్‌గా లేదా భోజనానికి చాలా సమయం ముందు పుచ్చకాయ తీసుకోవడం మంచిదని, ఏదైనా మితంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.