వెస్ట్‌బ్యాంక్‌లోని సైనిక కేంద్రం వద్ద పాలస్తీనా మిలిటెంట్లు జరిపిన కాల్పుల్లో ఐదుగురు ఇజ్రాయెలీయులు గాయపడ్డారు. ఈ ఘటనపై ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మిలిటెంట్లు మృతి చెందారు. నిందితుల వాహనంలో భారీగా ఆయుధాలు లభ్యమయ్యాయని, ఇది ఒక పెద్ద దాడిని అడ్డుకున్నామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. దీనితో పాటు వెస్ట్‌బ్యాంక్‌ను దిగ్బంధించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.