రాజా సాబ్ ట్రైలర్ లో కనిపించిన వరల్డ్ క్లాస్ మేకింగ్ క్వాలిటీ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ స్టాండర్డ్స్ ను చూపించింది. దర్శకుడు మారుతి ప్రభాస్ తో వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ అనిపించే సినిమా రూపొందించినట్లు రాజా సాబ్ ట్రైలర్ ప్రూవ్ చేస్తోంది. తనకు ఇష్టమైన రొమాంటిక్ హారర్ కామెడీ జానర్ లో తన ఫేవరేట్ హీరో ప్రభాస్ ను మారుతి వెర్సటైల్ గా చూపించారు. తమన్ బీజీఎంలోని వేరియేషన్స్ రాజా సాబ్ ట్రైలర్ కు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి.
ముగ్గురు హీరోయిన్స్ మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ రాజా సాబ్ కు కావాల్సినంత గ్లామర్ ను యాడ్ చేస్తున్నారు. సంక్రాంతి సందడిని రెట్టింపు చేసేందుకు జనవరి 9న థియేటర్స్ లోకి రాబోతున్న రాజా సాబ్ కోసం టాలీవుడ్ బాక్సాఫీస్ ఎదురుచూస్తోంది. ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ రాజా సాబ్ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకులు రాజా సాబ్ ను ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు వెయిట్ చేస్తున్నారు.