ఢిల్లీలోని మణిపాల్ ఆస్పత్రి వైద్యులు అరుదైన విజయాన్ని సాధించారు. పక్షవాతంతో చనిపోయిన గీతా చావ్లా (55) అనే మహిళ శరీరంలో ECMO (ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేటర్) ఉపయోగించి రక్తప్రసరణను తిరిగి ప్రారంభించారు. తర్వాత ఆమె కాలేయం, మూత్రపిండాలను సేకరించి ఇతరులకు విజయవంతంగా అమర్చారు. ఈ ప్రక్రియను ఆసియాలోనే తొలిసారిగా నిర్వహించి చరిత్ర సృష్టించినట్లు ఆస్పత్రి ఛైర్మన్ శ్రీనివాసన్ తెలిపారు.