‘బ్లడ్ కిక్’: మత్తు కోసం సొంత రక్తాన్నే ఇంజెక్ట్ చేసుకుంటున్నారు

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో యువత 'బ్లడ్ కిక్' అనే భయంకరమైన వ్యసనానికి బానిసలవుతున్నారు. మత్తు కోసం తమ రక్తాన్ని బయటకు తీసి, తిరిగి శరీరంలోకి ఎక్కించుకుంటున్నారు. జనవరి నుంచి ఇలాంటి 5 కేసులు వెలుగులోకి వచ్చాయి. ఈ వ్యసనం వల్ల ఇన్ఫెక్షన్లు, సెప్సిస్, హెపటైటిస్, నరాలు దెబ్బతినడం, రక్తం గడ్డకట్టడం వంటి తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. డిప్రెషన్, తనకు తాను గాయపర్చుకునే లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్