ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)లో భాగంగా నోటీసులు అందుకున్న ఓటర్లు ఇకపై ఆందోళన చెందనక్కర్లేదని, బీఎల్వోలే ఇంటికి వచ్చి డాక్యుమెంట్లను పరిశీలించి అప్లోడ్ చేస్తారని ఎన్నికల సంఘం తెలిపింది. సర్ ప్రక్రియపై ఆరోపణలు, కమిషన్లో విభేదాల ప్రచారం నేపథ్యంలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్, కమిషనర్లు సుఖ్ బీర్ సింగ్ సంధు, వివేక్ జోషీ సమావేశమై ఏకాభిప్రాయంతోనే నిర్ణయాలు తీసుకున్నామని, అంతర్గత చర్చలు సంస్థాగత ప్రక్రియలో భాగమేనని, నిర్ణయాల అమలులో ఎలాంటి విభేదాల్లేవని సంయుక్త ప్రకటనలో స్పష్టం చేశారు.