ముంబైలోని కోస్టల్ రోడ్డులో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వెళ్తున్న BMW కారు అదుపుతప్పి బ్రిడ్జి పైనుంచి పడిపోయింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో ముగ్గురు ఆక్కడిక్కడే మృతి చెందారు. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాద తీవ్రతకు కారు నుజ్జు నుజ్జు అయింది. ఈ ఘటనప పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.