జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ, తన రౌండ్ లోగోను ఎటువంటి అధికారిక ప్రకటన లేకుండా అప్‌డేట్ చేసింది. ఈ కొత్త లుక్‌ను మొదట సెప్టెంబర్ 2025లో iX3లో ప్రవేశపెట్టగా, ఫిబ్రవరి నుంచి అన్ని కార్లకు దీనిని ఉపయోగించనుంది. కొత్త లోగోలో బ్లూ, వైట్ ప్రాంతాలను విభజించే క్రోమ్ తొలగించబడింది, BMW అక్షరాలు స్లిమ్ చేయబడ్డాయి.బ్లాక్ కలర్ మ్యాట్ ఫినిషింగ్‌తో వస్తుంది. వారసత్వాన్ని నిలుపుకుంటూనే ఖచ్చితత్వాన్ని తీసుకురావడమే ఈ మార్పుల ఉద్దేశ్యమని బ్రాండ్ డిజైన్ బాస్ ఆలివర్ హీల్మెర్ తెలిపారు. యూరోపియన్ మార్కెట్లో అందుబాటులోకి వచ్చిన ఈ లోగోతో కూడిన వాహనాలు త్వరలోనే భారతదేశంలోనూ లభించనున్నాయి.