బోటు ప్రమాదం.. 139కి చేరిన మరణాలు (VIDEO)

ఆఫ్రికా దేశమైన జిబౌటి తీరంలో అక్టోబర్ 8 రాత్రి జరిగిన పడవ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 139కి చేరింది. యెమెన్‌కు ఉపాధి కోసం వెళ్తున్న వలసదారులతో ప్రయాణిస్తున్న పడవ సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించడంతో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 15 మంది చిన్నారులతో సహా 139 మంది మరణించగా, 84 మందికి పైగా గల్లంతయ్యారు. దాదాపు 82 మందిని రక్షించారు. జిబౌటి కోస్ట్‌గార్డ్, ఐఓఎమ్ బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి.

సంబంధిత పోస్ట్

✕
✕