మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో శుక్రవారం బార్గి డ్యామ్ జలాశయంలో 30 మంది ప్రయాణికులతో వెళ్తున్న క్రూయిజ్ బోటు తుఫాన్ కారణంగా బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో తొమ్మిది మంది మరణించారు. ప్రమాదంలో ఒక తల్లి తన నాలుగేళ్ల కొడుకును గట్టిగా పట్టుకుని కనిపించిన దృశ్యం అందరినీ కంటతడి పెట్టించింది. 22 మందిని సురక్షితంగా బయటకు తీయగా, మరికొందరు గల్లంతయ్యారు. బోటులో భద్రతా ప్రమాణాలు పాటించలేదనే ఆరోపణలు వస్తున్నాయి.