పడవ బోల్తా.. ఎనిమిది మంది దుర్మరణం (వీడియో)

ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లాలో కౌడియాలా నదిలో బుధవారం రాత్రి పడవ బోల్తా పడి ఎనిమిది మంది మృతిచెందారు. మృతుల్లో 60 ఏళ్ల మహిళతో పాటు ఐదుగురు పిల్లలు ఉన్నారు. లఖీంపూర్ ఖేరీ జిల్లా ఖైరతియా గ్రామానికి చెందిన 22 మంది భరతాపూర్ వెళ్తుండగా ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, ప్రజాప్రతినిధులతో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకోని గాలింపు చర్యలు చేపడుతున్నాయి.

సంబంధిత పోస్ట్