మధ్యధరా సముద్రంలో పడవ బోల్తా.. 80 మందికిపైగా గల్లంతు!

లిబియా నుంచి వలసదారులతో బయల్దేరిన ఓ పడవ మధ్యధరా సముద్రంలో బోల్తా పడింది. ఈ ఘటనలో 80 మందికిపైగా గల్లంతయ్యారని ఐక్యరాజ్యసమితి వలసల సంస్థ వెల్లడించింది. 120 మందితో ఆ పడవ బయల్దేరిందని, అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా సముద్రంలో ప్రమాదానికి గురైందని తెలిపింది. ఇప్పటివరకు ఇద్దరి మృతదేహాలు లభ్యం కాగా.. 32 మందిని ఇటలీ తీర రక్షక దళం కాపాడినట్లు పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్