పడవ బోల్తా.. ముగ్గురు మృతి

AP: అల్లూరి జిల్లా అనంతగిరి మండలం జీనబాడులో విషాదం చోటు చేసుకుంది. రైవాడ జలాశయంలో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఒకరి మృతదేహం లభ్యమైంది. మిగిలిన మృతదేహాల కోసం అధికారులు గాలిస్తున్నారు. ప్రమాద సమయంలో పడవలో నలుగురు ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్