చెట్టుకు ఉరేసుకుని ఇద్దరు బాలికల మృతదేహాలు

ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ జిల్లా హరైయా గ్రామంలో సోమవారం ఉదయం విషాద ఘటన చోటుచేసుకుంది. 17, 15 ఏళ్ల వయసున్న ఇద్దరు బాలికల మృతదేహాలు ఒకే జామచెట్టుకు వేలాడుతూ కనిపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు, ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టాయి. ఇద్దరూ దగ్గరి బంధువులని, మంచి స్నేహితులని ప్రాథమిక విచారణలో తేలింది. సోషల్ మీడియాలో రీల్స్ పోస్టు చేసేవారని పోలీసులు గుర్తించారు. వారి ఇళ్ల మధ్య కూడా కొద్ది దూరమే ఉన్నట్లు సమాచారం. అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.

సంబంధిత పోస్ట్

✕
✕