AP: ప్రకాశం జిల్లా కంభంలో విషాదం చోటు చేసుకుంది. లింగోజిపల్లిలో అదృశ్యమైన మూడేళ్ల బాలుడు లక్షిత్ మృతదేహం లభ్యమైంది. రెండు రోజుల క్రితం అంగన్వాడీ పాఠశాలకు వెళ్లిన లక్షిత్ తిరిగిరాలేదు. దీంతో అతని కోసం కుటుంబ సభ్యులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో సూరేపల్లి సమీపంలో గురువారం అతని మృతదేహం కనిపించింది. చిన్నారి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.