విమాన ప్రమాదం.. భారతీయ కుటుంబానికి రూ.317 కోట్లు పరిహారం

2019లో ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ బోయింగ్ 737 మాక్స్ విమానం ప్రమాదంలో మరణించిన భారతీయ పౌరురాలు శిఖా గార్గ్ కుటుంబానికి రూ.317 కోట్లు (35.85 మిలియన్ డాలర్లు) పరిహారం చెల్లించాలని చికాగోలోని ఫెడరల్ జ్యూరీ ఆదేశించింది. ఐక్యరాజ్యసమితి కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న శిఖ, నైరోబికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. విమాన డిజైన్‌లో లోపాలు, హెచ్చరికల్లో వైఫల్యం ఆరోపిస్తూ శిఖ కుటుంబం దావా వేసింది. ఆరేళ్ల న్యాయ పోరాటం తర్వాత ఈ తీర్పు వెలువడింది.

సంబంధిత పోస్ట్