అస్సాం లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జూలై 6న దిఫు-మంజా రోడ్ లో బొలెరో వాహనం, ఆటో ట్రక్ రెండు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అక్కడి KANCH రిసార్ట్ (శివ మందిర్) సమీపంలో బొలెరో వాహనాన్ని వాటర్ బాటిళ్ల లోడ్ తో వెళ్తున్న ఆటో ట్రక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బొలెరో నుజ్జునుజ్జు అయింది. ఈ ప్రమాద దృశ్యాలు అక్కడి సీసీటీవీలో రికార్డయ్యాయి.