తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావుతో బాలీవుడు నటుడు గగన్ మాలిక్ సోమవారం భేటీ అయ్యారు. గగన్‌ను బుద్ధవనం ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్ మల్లేపల్లి లక్ష్మయ్యకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా నాగార్జున సాగర్‌లో ఉన్న బుద్ధవనానికి ప్రపంచ దేశాల్లో ప్రాచుర్యం కల్పించడం, ఈ ఏడాది అక్టోబర్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన బౌద్ధ భిక్షువులు సుమారు వంద మంది బుద్ధవనానికి పాదయాత్రగా వస్తున్న విషయం సహా పలు అంశాలపై ఇరువురు చర్చించుకున్నారు.