బాలీవుడ్ నటుడు విద్యుత్ జమ్వాల్ నగ్నంగా చెట్టు ఎక్కిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసి షాక్ ఇచ్చారు. 'కలరిపయట్టు సాధకుడిగా నేను ఏడాదికి ఓసారి సహజ యోగా సాధన చేస్తాను. మన సహజమైన స్థితికి దగ్గరగా వెళ్లడమే సహజ. ఇది ప్రకృతితో, మన అంతరాత్మతో మమేకమయ్యేలా చేస్తుంది' అని రాసుకొచ్చారు. దీంతో మరీ ఇలానా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.