బాలీవుడ్ దర్శకుడు విక్రమ్ భట్, ఆయన భార్య అరెస్ట్

బాలీవుడ్ దర్శకుడు విక్రం భట్, ఆయన భార్య శ్వేతాంబరిని ఆదివారం ముంబయిలో పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్‌కు చెందిన ఇందిరా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ అజయ్‌ మర్దియాను రూ.30 కోట్లకు మోసం చేశారనే ఆరోపణలపై వీరిని అదుపులోకి తీసుకున్నారు. మర్దియా భార్య జీవిత చరిత్రపై సినిమా తీయడానికి విక్రం భట్ రూ.47 కోట్లు పెట్టుబడి పెడితే 4 సినిమాలు తీసి రూ.200 కోట్ల లాభం వస్తుందని నమ్మించి, రూ.30 కోట్లు తీసుకుని రెండు సినిమాలు మాత్రమే పూర్తి చేశారని, మిగిలినవి తీయలేదని పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్