ఆదిత్య రాయ్ కపూర్, శ్రద్ధా కపూర్ కలిసి జంటగా నటించిన ప్రేమ కథ చిత్రం 'ఆషికి 2'. ఈ మూవీలో ప్రేమ పక్షుల్లా కనిపించి వారి నటన, పాటలతో బాలీవుడ్‌లో ట్రెండ్ సెట్ చేశారు. తర్వాత మణిరత్నం డైరెక్టన్‌లో వచ్చిన 'ఓకే బంగారం' మూవీని, హిందీలో 'ఓకే జాను' గా నిర్మించారు. ఇందులోను ప్రేక్షకులను మెప్పించారు. కాగా ప్రస్తుతం వీరు మూడోసారి జతకట్టనున్నట్లు బీటౌన్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీని మోహిత్ సూరి రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కించనున్నట్లు సమాచారం.