జూన్ 12న లక్నో నుంచి ఢిల్లీ బయల్దేరాల్సిన ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. విమానం టేకాఫ్ కావడానికి కొద్ది నిమిషాల ముందు వచ్చిన ఈ బెదిరింపుతో, విమానాన్ని నిలిపివేసి ప్రయాణికులను, సిబ్బందిని సురక్షితంగా దించివేశారు. సీఐఎస్ఎఫ్, స్థానిక పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. ఈ సంఘటనతో విమానాశ్రయంలో కొద్దిసేపు విమాన సేవలకు అంతరాయం ఏర్పడి, కొన్ని సర్వీసులు ఆలస్యమయ్యాయి. బాంబు బెదిరింపు ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.