సౌదీ అరేబియాలోని మదీనా నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. దీంతో గుజరాత్‌లోని అహ్మదాబాద్ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. విమానంలో 180 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. బాంబు స్క్వాడ్ విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసింది. ఈ ఘటనతో ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.