కన్నూర్ నుంచి హైదరాబాద్ వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు రావడంతో శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు అప్రమత్తమయ్యారు. విమానం సురక్షితంగా ల్యాండ్ అయిన అనంతరం దాన్ని ఐసోలేషన్ బేకు తరలించారు. ప్రయాణికులను కిందకు దించిన అధికారులు విమానంలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. బాంబు బెదిరింపు నేపథ్యంలో ఎయిర్పోర్టులో భద్రతా చర్యలను ముమ్మరం చేశారు.