కేరళ సీఎం విజయన్‌ నివాసానికి బాంబు బెదిరింపు

కేరళ సీఎం పినరయి విజయన్ అధికారిక నివాసానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. తంపనూరు పోలీస్ స్టేషన్‌కు గుర్తు తెలియని వ్యక్తులు పంపిన ఇ-మెయిల్‌లో క్లిఫ్ హౌస్ వద్ద బాంబు పేలుళ్లు జరగనున్నాయని హెచ్చరించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అప్రమత్తమై సీఎం నివాస పరిసరాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఆ తర్వాత దర్యాప్తులో ఇది నకిలీ ఇ-మెయిల్‌గా నిర్ధారణ అయింది.

సంబంధిత పోస్ట్