దేశంలో 5 విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు

ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, త్రివేండ్రం, ముంబై విమానాశ్రయాలను పేల్చేస్తామని బెదిరింపు మెయిల్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇండిగో ఎయిర్ లైన్స్ కార్యాలయానికి ఈ మెయిల్ అందింది. దీంతో ఐదు విమానాశ్రయాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌తో పాటు బస్టాప్‌లు, దేవాలయాలు, షాపింగ్ మాల్స్‌లోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. వారణాసికి వెళ్లే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలోని ప్రయాణికులను కూడా ఖాళీ చేయించి తనిఖీలు చేశారు.

సంబంధిత పోస్ట్